భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌గా సలీమా

by Harish |
భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌గా సలీమా
X

దిశ, స్పోర్ట్స్ : ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్(ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ 2023-24 టోర్నీలో బెల్జియం, ఇంగ్లాండ్‌ల్లో మ్యాచ్‌లకు గురువారం భారత మహిళల హాకీ జట్టు ఖరారైంది. కెప్టెన్ సవిత పూనియా, వైస్ కెప్టెన్ వందన‌లపై హాకీ ఇండియా వేటు వేసింది. ఈ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా మిడ్‌ఫీల్డర్ సలీమా టెటే నియామకమైంది. ఆమెకు మరో మిడ్‌ఫీల్డర్ నవ్‌నీత్ కౌర్ డిప్యూటీగా వ్యవహరించనుంది. ఫిబ్రవరిలో భారత్‌లో జరిగిన ప్రొ లీగ్ మ్యాచ్‌లు ఆడిన జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. గుర్జిత్ కౌర్, సోనికా, నిషా, బ్యూటీ డంగ్‌ డంగ్‌ జట్టులో చోటు కోల్పోగా.. మహిమా చౌదరి, మనీషా చౌహాన్, ప్రీతి దూబె, దీపిక సొరెంగ్‌లకు స్థానం దక్కింది. కెప్టెన్ సలీమా మాట్లాడుతూ..‘జట్టును నడిపించే అవకాశం రావడం పట్ల ఆనందంగా ఉంది. ఇది చాలా పెద్ద బాధ్యత. కొత్త రోల్‌ కోసం ఎదురుచూస్తున్నా. అనుభవజ్ఞులు, యువ ప్లేయర్లతో జట్టు బలంగా ఉంది. వచ్చే మ్యాచ్‌ల్లో మేము బలమైన అడుగు వేస్తాం.’ అని తెలిపింది. కాగా, మే 22 నుంచి 26 వరకు బెల్జియంలో ఆతిథ్య జట్టు, అర్జెంటీనాతో, జూన్ 1 నుంచి 9 వరకు ఇంగ్లాండ్‌లో గ్రేట్ బ్రిటన్, జర్మనీ జట్లతో భారత జట్టు రెండేసి మ్యాచ్‌ల్లో తలపడనుంది. ప్రస్తుతం టోర్నీలో భారత్ 8 పాయింట్లతో 6వ స్థానంలో ఉన్నది.

భారత మహిళల హాకీ జట్టు :

గోల్ కీపర్స్ : సవిత, బిచ్చు దేవి, డిఫెండర్స్ : నిక్కీ ప్రదాన్, ఉదిత, ఇషికా చౌదరి, మోనిక, జ్యోతి ఛత్రి, మహిమ చౌదరి, మిడ్‌ఫీల్డర్స్ : సలీమా టెటే(కెప్టెన్), వైష్ణవి, నవ్‌నీత్ కౌర్(వైస్ కెప్టెన్), నేహా, జ్యోతి, బల్జీత్ కౌర్, మనిషా చౌహాన్, లాల్రేమ్సియామి, ఫార్వడ్స్ : ముంతాజ్ ఖాన్, సంగీత కుమారి, దీపిక, షర్మిలా దేవి, ప్రీతి దూబె, వందన కటారియా, సునేలితా టొప్పో, దీపిక సొరెంగ్.

Advertisement

Next Story

Most Viewed