Ruturaj Gaikwad : భార్య జెర్సీతో బరిలోకి.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన చెన్నై ఓపెనర్

by Vinod kumar |   ( Updated:2023-06-16 10:22:23.0  )
Ruturaj Gaikwad : భార్య జెర్సీతో బరిలోకి.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన చెన్నై ఓపెనర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంపీఎల్‌ 2023 (మహారాష్ట్ర ప్రీమియర్‌ లీగ్‌)లో భాగంగా పుణేరి బప్పా, కొల్హాపూర్‌ టస్కర్స్‌ మధ్య ఆరంభ మ్యాచ్‌ జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో రుతురాజ్‌ తన భార్య ఉత్కర్ష పవార్‌ జెర్సీ నెంబర్‌తో బరిలోకి దిగి.. అదరగొట్టాడు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ సాధించిన రుతురాజ్‌ ఓవరాల్‌గా 27 బంతుల్లోనే 5 సిక్సర్లు, 5 ఫోర్లతో 67 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో కొల్హాపూర్‌ టస్కర్స్‌ విధించిన 145 పరుగుల టార్గెట్‌ను 29 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.

పుణే ఫ్రాంచైజీ పుణేరి బప్పా జట్టు రూ.14.8 కోట్లతో రుతురాజ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసుకుంది. ఉత్కర్ష పవార్‌ సీఎస్‌కే స్టాప్‌ సిబ్బందిగా ఉన్న విషయం తెలిసిందే. ఆమె జెర్సీ నెంబర్‌ 13.. రుతురాజ్‌ జెర్సీ నెంబర్‌ 31.. కానీ నిన్నటి మ్యాచ్‌లో రుతురాజ్‌ తన భార్యపై ప్రేమను వ్యక్తం చేస్తూ ఆమె జెర్సీ నెంబర్‌ అయిన 13తో బరిలోకి దిగాడు.

Advertisement

Next Story

Most Viewed