- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నన్ను పెళ్లి చేసుకుంటావా..’ అంటూ.. ఫ్యాన్‌కు షాక్ ఇచ్చిన రోహిత్ శర్మ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోనే కాదు.. అభిమానులతోనూ సరదాగా ఉంటాడు. వారిపై తన ప్రేమను సందర్భం వచ్చినప్పుడల్లా చూపిస్తాడు. ఇలాంటి ఓ ఇన్సిడెంట్ రీసెంట్ గా వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో చోటు చేసుకుంది. ఓ అభిమానికి హిట్ మ్యాన్ సరదాగా ప్రేమ ప్రపోజల్ చేశాడు. పువ్వు ఇచ్చి మరి పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. కాగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తొలి వన్డేకు వ్యక్తిగత కారణాలతో రోహిత్ అందుబాటులో లేడు.
రెండో వన్డేలో జట్టులో చేరాడు. టీమ్ మెంబర్స్ తో కలిసి వైజాగ్ విమానాశ్రయంలో దిగాడు. ఆటగాళ్లంగా బయటకు వస్తుండగా ఓ అభిమాని వారిని ఫాలో అయ్యాడు. ఫోన్ లో సెల్ఫీ వీడియో తీశాడు. ఇంతలో అతడి వద్దకు రోహిత్ వచ్చి.. తన వద్ద ఉన్న గులాబీని ఇచ్చాడు. ‘తీసుకో ఇది నీ కోసమే.. నన్ను పెళ్లి చేసుకుంటావా..’ అని సరదాగా అడిగాడు. రోహిత్ పలకరించినందుకు హ్యాపీ అయిన ఫ్యాన్ హిట్ మ్యాన్ ప్రపోజల్ కు మాత్రం ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే విశాఖ వన్డేలో టీమ్ ఇండియా అన్ని విభాగాల్లో విఫలమయి ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే..
Rohit Sharma is an amazing character - what a guy! pic.twitter.com/YZzPmAKGpk
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 19, 2023