- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూజిలాండ్ పై భారత్ ఘోర ఓటమిపై స్పందించిన రోహిత్ శర్మ
దిశ, వెబ్ డెస్క్: భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఇందులో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఐదు రోజుల టెస్టు మ్యాచ్ లో నాలుగు రోజులు మ్యాచ్ జరగ్గా.. న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 0-1 తేడాతో సిరీస్ లో లీడ్ లో ఉంది. కాగా ఈ భారీ ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. ఈ టెస్టులోని మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులకు ఆలౌట్ అవుతామని ఊహించలేదని, మొదటి ఇన్నింగ్స్ న్యూజిలాండ్ బౌలింగ్ ముందు భారత బ్యాటర్లం విపలం చెందామని అన్నారు. కానీ రెండో ఇన్నింగ్స్ లో మెరుగ్గా రాణించామని, రిషబ్ పంత్, సర్ఫరాజ్ భాగస్వామ్యంలో మెరుగ్గా కనిపించిందని అన్నారు. అలాగే మొదటి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోర్ చేయడం వల్ల ఓటమి చెందామని,, తర్వాతి మ్యాచులో తమ తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకొని.. సిరీస్ కైవసం చేసుకుంటామని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.