- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మియామి ఓపెన్ టైటిల్ బోపన్న జోడీదే
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : 44 ఏళ్ల వయసులో భారత సీనియర్ టెన్నిస్ డబుల్స్ ప్లేయర్ రోహన్ బోపన్న అదరగొట్టాడు. అమెరికాలో జరుగుతున్న మియామి ఓపెన్ టోర్నీలో మాథ్యూ ఎబ్డెన్(ఆస్ట్రేలియా)తో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్‌లో బోపన్న జోడీ 6-3(3-7), 6-3, 10-6 తేడాతో ఇవాన్ డోడిగ్(క్రోయేషియా)-ఆస్టిన్ క్రాజిసెక్(అమెరికా) జోడీని చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బోపన్న జంటకు శుభారంభం దక్కలేదు. తొలి సెట్‌ను టై బ్రేకర్‌లో కోల్పోయింది. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న ఆ జంట వరుసగా మిగతా రెండు సెట్లను దక్కించుకుని చాంపియన్‌గా నిలిచింది. దీంతో ఈ సీజన్‌లో ఈ జోడీ ఖాతాలో రెండో టైటిల్ చేరింది. జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
Advertisement
Next Story