పాక్ జట్టుకు సర్జరీ చేయాలి : స్టార్ క్రికెటర్ రిజ్వాన్ సంచలన వ్యాఖ్యలు

by Harish |
పాక్ జట్టుకు సర్జరీ చేయాలి : స్టార్ క్రికెటర్ రిజ్వాన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో చెత్త ప్రదర్శన చేసిన పాకిస్తాన్ జట్టు గ్రూపు దశలోనే ఇంటిదారిపట్టింది. దీంతో ఆ జట్టుపై సొంత దేశం నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ జట్టుకు మేజర్ సర్జరీ చేయాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పీసీబీ చైర్మన్ వ్యాఖ్యలను పాక్ స్టార్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ సమర్ధించాడు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. జట్టుకు ఆపరేషన్ చేయాల్సిందేనన్నాడు.

‘జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. మేము అంచనాలను అందుకోలేకపోయాం. కాబట్టి, విమర్శలకు మేము అర్హులమే. విమర్శలు తీసుకోలేని ఆటగాళ్లు విజయం సాధించలేరు. టీ20 వరల్డ్ కప్‌లో మా వైఫల్యానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆపరేషన్ సాధారణ విషయం. వ్యక్తి అనారోగ్యానికి గురైతే ఆపరేషన్ తప్పనిసరి. జట్టులో ఎవరు ఉండాలి. ఎవరు ఉండకూడదని నిర్ణయించే హక్కు పీసీబీ చైర్మన్‌కు ఉంది.’అని వ్యాఖ్యానించాడు. కాగా, టీ20 ప్రపంచకప్‌లో రిజ్వాన్ నాలుగు మ్యాచ్‌ల్లో 110 పరుగులు చేశాడు. గ్రూపు దశలో పాక్ జట్టు రెండు విజయాలతో మూడో స్థానంతో సరిపెట్టింది. పాక్‌తో మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed