- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ricky Ponting: సచిన్ రికార్డు బద్దలు కొట్టే సత్తా ఆ ప్లేయర్‌కు ఉంది
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ దిగ్గజ క్రీడాకారుడు సచిన్ టెండుల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కొన్ని దశాబ్దాల పాటు క్రికెట్ సామ్రాజ్యాన్ని ఏలాడు అని చెప్పడానికి ఎవరూ సందేహించరు. తన క్రికెట్ కెరియర్‌లో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వంద సెంచరీలు బాదిన ఆటగాడిగా, వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా, అందరి కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా ఇలా చెప్పుకుంటూ పోతే సచిన్ పేరిట అనేక రికార్డులు ఉన్నాయి. అయితే, తాజాగా సచిన్ రికార్డులపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెస్టుల్లో సచిన్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్ బ్రేక్ చేస్తాడని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం టెస్టుల్లో జో రూట్ 12,027 పరుగులతో ఏడో స్థానంలో కొనసాగుతున్నారు. సచిన్ 15,921 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నారు. సచిన్ తర్వాతి స్థానాల్లో రికీ పాంటింగ్(13,378), జాక్ కల్లిస్(13,289), రాహుల్ ద్రవిడ్(13,288), అలేస్టర్ కుక్(12,472), కుమార సంగక్కర(12,400) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.