- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్‌కు మనుకు విశ్రాంతి
దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్, స్టార్ షూటర్ మను బాకర్ వచ్చే నెలలో జరగబోయే ఐఎస్‌ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్‌కు అందుబాటులో ఉండటం లేదు. వరల్డ్ కప్ ఫైనల్‌కు ఆమెకు విశ్రాంతినిచ్చారు. ఈ ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో అక్టోబర్ 13 నుంచి 18 వరకు జరగనుంది. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఆర్ఏఐ) గురువారం వరల్డ్ కప్ ఫైనల్‌కు భారత బృందాన్ని ప్రకటించింది. ఈ ఈవెంట్‌లో 23 మంది భారత షూటర్లు బరిలోకి దిగబోతున్నారు. దివ్యాన్ష్ సింగ్(పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), సోనమ్ ఉత్తమ్ మస్కర్(మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), రిథమ్ సంగ్వాన్(మహిలల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల పిస్టల్), గణేమత్ సెఖోన్(మహిళల స్కీట్) నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించారు. మిగతా వారు ర్యాంకింగ్స్, ఒలింపిక్ ట్రయల్స్ ద్వారా ఎంపికయ్యారు. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న బృందంలోని 9 మంది షూటర్లు ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నారు.
- Tags
- #Manu Bhaker