WPL 2023: ఎట్టకేలకు తొలి విజయం అందుకున్న RCB

by Mahesh |
WPL 2023: ఎట్టకేలకు తొలి విజయం అందుకున్న RCB
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో 13వ మ్యాచ్ లో యూపీ వారియర్జ్, బెంగుళూరు జట్ల మధ్య ముంబై వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో RCB జట్టు WPLలో తమ తొలి విజయాన్ని అందుకుంది. యూపీపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అలాగే వరుసగా ఐదు ఓటమిల తర్వాత తొలి విజయాన్ని అందుకున్న RCB టోర్నమెంట్ లో కొనసాగేందుకు తమ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఈ మ్యాచ్ లో కనికా అహుజా 46 పరుగులతో రాణించడంతో యూపీ వారియర్జ్ పై RCB జట్టు రెండు ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

Advertisement

Next Story