- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సంచలనంగా మారిన RCB జెర్సీ అన్‌బాక్సింగ్ ఈవెంట్

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ (IPL) 2025వ సీజన్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్ కు ముందు మెగా వేలం (Mega Auction)లో కీలక ప్లేయర్లను ఆయా జట్లు కొనుగోలు చేసుకొని తమ జట్లను పటిష్టం చేసుకున్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ లో అత్యధిక ప్రజాదరణ పొందిన జట్లలో ఆర్సీబీ (RCB) ముందు స్థానంలో ఉంటుంది. అయితే ఈ జట్టు గత 17 సీజన్లో ఒక్క సారి కూడా కప్పును కొట్టలేకపోయింది. దీంతోనే ఈ సీజన్‌లో అయిన కప్పును కొట్టి తమ కలతో పాటుగా ఆర్సీబీ అభిమానుల కలను నెరవేర్చుకోవాలని ఆర్సీబీ చూస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిమానులకు కలిగి ఉన్న ఈ జట్టు ఈ సంవత్సరం కొత్త ప్లేయర్లతో రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో సోమవారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కొత్త జెర్సీ అన్ బాక్సింగ్ ఈవెంట్ (Jersey Un Boxing Event) నిర్వహించారు. ఈ ఈవెంట్ కూడా సంచలనంగా మారింది. ముందస్తుగానే ఈ ఈవెంట్ కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.
అయితే ఈ జెర్సీ అన్ బాక్సింగ్ ఈవెంట్ కు సంబంధించిన టికెట్లను వెట్‌సైట్ లో అందుబాటులో ఉంచినట్లు ప్రకటన ఇచ్చారు. దీంతో క్షణాల వ్యవధిలోనే లక్షలాది మంది టికెట్ల కోసం.. ఎగబడటంతో.. ఆర్సీబీ వెబ్ సైట్ క్రాష్ (Website crash) అయినట్లు తెలిపారు. కాగా ఆఫ్ లైన్ లో కూడా టికెట్లను అందించారు. దీంతో జెర్సీ అన్ బాక్సింగ్ ఈవెంట్ కు చిన్నస్వామి స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోయింది. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం.. RCB జెర్సీ అన్‌బాక్స్ ఈవెంట్‌కు ముందు రజత్ పాటిదార్ (Rajat Patidar)ను తమ కొత్త కెప్టెన్‌గా ప్రకటించింది. రాపర్ హనుమాన్‌కిండ్ సహా తో పాటు ఇతర సంగీతకారులు ప్రేక్షకుల కోసం ప్రదర్శన ఇచ్చారు. అనంతరం చివరకు కొత్త జెర్సీని విడుదల చేశారు. జెర్సీ అన్ బాక్సింగ్ అనంతరం ప్లేయర్లు అంతా.. ప్లే బోల్డ్ అనే వేదికపై నిల్చోని ఫోటోలు దిగారు.