- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
IND VS NZ : జడేజాకు ఐదు వికెట్లు, జహీర్, ఇషాంత్‌లను వెనక్కినెట్టిన స్టార్ ఆల్‌రౌండర్
దిశ, స్పోర్ట్స్ : భారత స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో శుక్రవారం సత్తాచాటాడు. ఐదు వికెట్లతో చెలరేగాడు. 22 ఓవర్లు వేసిన అతను 3.00 ఎకానమీతో 65 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. విల్ యంగ్, టామ్ బ్లండెల్, ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ వికెట్లతో ప్రత్యర్థి మోస్తరు స్కోరుకే పరిమితమవడంలో కీలక పాత్ర పోషించాడు. టెస్టుల్లో ఐదు వికెట్లు తీయడం అతనికి ఇది 14వ సారి కావడం విశేషం. అలాగే, జడేజా మరో ఘనత కూడా సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన 5వ భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ ఐదు వికెట్లతో అతని ఖాతాలో 312 వికెట్లు చేరాయి. దీంతో జడేజా.. జహీర్ ఖాన్(311), ఇషాంత్ శర్మ(311)లను వెనక్కినెట్టాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే(619) హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా ఉండగా.. ఆ తర్వాత అశ్విన్(533), కపిల్ దేవ్(434), హర్భజన్ సింగ్(417), జడేజా టాప్-5లో ఉన్నారు.