అవన్నీ అవాస్తవాలే.. తండ్రి వ్యాఖ్యలపై స్పందించిన జడేజా

by Harish |
అవన్నీ అవాస్తవాలే.. తండ్రి వ్యాఖ్యలపై స్పందించిన జడేజా
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి వార్తల్లో నిలిచాడు. తొలి టెస్టులో గాయపడిన అతను మిగతా సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా?లేడా? అన్న దానిపై క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుండగా.. మరోవైపు, కుటుంబ కలహాలతో జడేజా ట్రెండింగ్‌లో ఉన్నాడు. తాజాగా జడేజా తండ్రి అనిరుధ్ జడేజాపై, అతని భార్య రివాబాపై చేసిన సంచలన వ్యాఖ్యలతో కుటుంబ కలహాలు బహిర్గతమయ్యాయి. తండ్రి చేసిన ఆరోపణలపై జడేజా శుక్రవారం ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించాడు. అర్థం లేని వ్యాఖ్యలన్న జడేజా.. తన భార్య రివాబాపై చేసిన విమర్శలను ఖండించారు. ‘స్కిప్టెడ్ ఇంటర్వ్యూను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందులో చెప్పినవన్నీ అర్థం లేనివి. అవాస్తవాలు. అంతా ఒక వైపు నుంచే చెప్పారు. ఆ ఆరోపణలను ఖండిస్తున్నా. నా భార్య ప్రతిష్టను దెబ్బతీసేలా చేసిన ఈ ప్రయత్నం సరికాదు. నేను చెప్పాల్సింది కూడా చాలా ఉంది. కానీ, బహిరంగంగా అలా చేయను.’ అని జడేజా రాసుకొచ్చాడు. కాగా, 2016లో జడేజా రివాబాను పెళ్లి చేసుకున్నాడు. 2022లో జరిగిన గుజరాత్ ఎన్నికల్లో రివాబా బీజేపీ తరపున జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

అసలేం జరిగిందంటే?

తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న జడేజా తండ్రి అనిరుధ్.. జడేజా, అతని భార్య రివాజ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘నాకు రవీంద్ర, అతని భార్య రివాబాతో బంధం తెగిపోయింది. మేము వాళ్లకు కాల్ చేయం. వారు మాకు చేయరు. పెళ్లి అయిన రెండు, మూడు నెలలకే సమస్యలు వచ్చాయి. జామ్‌నగర్‌లో నేను ఒంటరిగా ఉంటున్నా. జడేజా తన భార్యతో కలిసి మరో బంగ్లాలో ఉంటున్నాడు. ఒకే సిటీలో ఉంటున్నా నేను అతన్ని చూడలేదు. అతని భార్య ఏం మాయ చేసిందో తెలియదు. అతనికి పెళ్లి చేయకుండా ఉండాల్సింది. జడేజా క్రికెటర్ కాకుండా ఉండాల్సింది. అప్పుడు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. పెళ్లైన మూడు నెలలకే అన్నీ తనపేరు మీదకు మార్చాలని చెప్పింది. ఆమె మా కుటుంబాన్ని చీల్చింది. నేను, జడేజా సోదరి తప్పుగా చెప్పి ఉండొచ్చు. మా కుటుంబానికి చెందిన 50 మంది తప్పుగానే చెబుతారా?. కుటుంబంలో ఎవరితోనూ రిలేషన్‌ లేదు. ద్వేషం మాత్రమే ఉంది.’ అని అనిరుధ్ చెప్పుకొచ్చాడు. దీంతో అనిరుధ్ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed