- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రవీంద్ర జడేజాపై బాల్ టాంపరింగ్ ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
దిశ, వెబ్‌డెస్క్: నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో మొదలైన తొలి టెస్టులో జడేజా ఐదు వికెట్లు తీసి ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా చేసిన ఒక పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ రెండో సెషన్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు జడేజా తన వేలికి ఏదో అప్లై చేస్తున్న వీడియోను ఓ ఆస్ట్రేలియా నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో జడేజా మహ్మద్ సిరాజ్ నుంచి ఏదో తీసుకుని ఎడమ వేలికి రాస్తూ.. కనిపించాడు. దీనిపై ఓ ఆస్ట్రేలియా అభిమాని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్‌ను ప్రశ్నించగా.. పైన్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఈ వీడియోకు 'ఇంట్రెస్టింగ్' అని రిప్లై ఇచ్చాడు. మరికొందరు జడేజా ఏమైనా చీటింగ్ చేశాడా..? అని కామెంట్లు పెట్టారు.
ఈ క్రమంలో జడేజాపై వస్తోన్న బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలపై బీసీసీఐ స్పందించింది. వేలి నొప్పిని తగ్గించే 'సాలువాఘీ ఆయింట్‌మెంట్' (నొప్పి-ఉపశమన క్రీమ్) మాత్రమే జడేజా తన వేలికి పూసినట్లు బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. జడేజాపై వస్తోన్న బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలను కొట్టిపారేసింది. ఇక నిన్నటి మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. టెస్టుల్లో జడేజా 5 వికెట్లు తీయడం ఇది 11వ సారి.