ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా ప్రెసిడెంట్‌గా తొలిసారిగా భారతీయుడు ఎన్నిక

by Harish |
ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా ప్రెసిడెంట్‌గా తొలిసారిగా భారతీయుడు ఎన్నిక
X

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ షూటర్, స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్ రణధీర్ సింగ్ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఓసీఏ) ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన 44వ ఓసీఏ జనరల్ అసెంబ్లీలో అధ్యక్ష ఎన్నిక జరిగింది. రణ‌ధీర్ సింగ్‌కు పోటీ ఎవరూ లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో ఓసీఏ ప్రెసిడెంట్‌‌గా ఎన్నికైన తొలి భారతీయుడిగా రణ‌ధీర్ సింగ్ చరిత్ర సృష్టించారు. 2021 నుంచి ఆయన ఓసీఏ తాత్కాలిక ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ప్రెసిడెంట్‌గా ఉన్న కువైట్‌కు చెందిన షేక్ అహ్మద్ అల్ ఫహద్ అల్ సబా ఈ ఏడాది ప్రారంభంలో 15 ఏళ్ల నిషేధం ఎదుర్కోవడంతో రణ‌ధీర్ పగ్గాలు చేపట్టారు.

తాజాగా ఓసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన 2028 వరకు ఆ పదవిలో కొనసాగననున్నారు. కాగా, 77 ఏళ్ల రణధీర్ 1968-84 మధ్య మిక్స్‌డ్ ట్రాప్ షూటింగ్ కేటగిరీలో ఐదు ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. 1984లో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌లో జాయింట్ సెక్రెటరీగా స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్‌ కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన క్రీడా పరిపాలనలో కీలక వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2011-14 వరకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అలాగే, గ్లోబల్ స్పోర్ట్స్ బాడీలోనూ గౌరవ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed