- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సౌతాఫ్రికా సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన డికాక్, నోర్జే
దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్, స్టార్ పేసర్ ఎన్రిచ్ నోర్జేలకు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు షాకిచ్చింది. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి వీరిని తప్పించింది. సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు మంగళవారం 2024-25కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ప్రకటించింది. ఇందులో 18 మంది ఆటగాళ్లకు చోటు కల్పించింది. పలువురు సీనియర్లకు షాకిచ్చిన బోర్డు.. ఇటీవల సత్తాచాటిన యువ క్రికెటర్లకు కాంట్రాక్ట్ ఇచ్చింది. డికాక్, నోర్జేతోపాటు, కీగన్ పీటర్సన్, పార్నెల్ వంటి సీనియర్లకు చోటు దక్కలేదు. మరోవైపు, టీమ్ ఇండియాపై అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన యువ పేసర్ నాండ్రే బర్గర్‌తోపాటు బ్యాటర్ టోని డె జోర్జి తొలిసారిగా సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. అలాగే, గతేడాది వన్డే వరల్డ్ కప్‌లో సత్తాచాటిన పేసర్ గెరాల్డ్ కోయెట్జీకు ప్రమోషన్ ఇచ్చిన బోర్డు పూర్తి కాంట్రాక్ట్ కల్పించింది. ఆల్‌రౌండర్ పెహ్లుక్‌వయో తిరిగి కాంట్రాక్ట్ పొందాడు. టెంబా బావుమా, క్లాసెన్, జాన్సెన్, రీజా హెండ్రిక్స్, జోర్న్ ఫోర్చ్యున్, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహరాజ్, మార్‌క్రమ్, ర్యాన్ రికెల్టన్, డస్సెన్, రబాడ, షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్ కాంట్రాక్ట్ లిస్టులో ఉన్నారు.