Punjab bypolls : కాంగ్రెస్ స్టేట్ చీఫ్, బీజేపీ అభ్యర్థికి ఈసీ నోటీసులు.. కారణమిదే..!

by Sathputhe Rajesh |
Punjab bypolls : కాంగ్రెస్ స్టేట్ చీఫ్, బీజేపీ అభ్యర్థికి ఈసీ నోటీసులు.. కారణమిదే..!
X

దిశ, నేషనల్ బ్యూరో : పంజాబ్ కాంగ్రెస్ స్టేట్ చీఫ్ అమ్రిందర్ సింగ్ రాజా వారింగ్, బీజేపీ నేత మన్ ప్రీత్ సింగ్ బాదల్‌కు ఈసీ మంగళవారం నోటీసులు జారీ చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకుంది. లుథియానా ఎంపీగా ఉన్న వారింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. మసీదులో మీటింగ్ నిర్వహించి ఉపఎన్నికలో గిద్దర్బహ స్థానం నుంచి పోటీ చేస్తున్న తన భార్య అమ్రిత వారింగ్‌కు ఓటు వేయాలని కోరినట్లు ఫిర్యాదులో పేర్కొంది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రభావితం చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని బీజేపీ అభ్యర్థి మన్ ప్రీత్ సింగ్ బాదల్ అన్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనకు సైతం ఈసీ నోటీసులు ఇష్యూ చేసింది. అయితే రాజా వారింగ్ గిదర్బహ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2024 ఎంపీ ఎన్నికల్లో ఆయన లుథియానా నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయడంతో ఈ స్థానంలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 20న పంజాబ్‌లోని గిదర్బహ, డేరా బాబా నానాక్, చబ్బేలాల్, బర్నాలా అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నిక జరగనుంది. కాగా, ఈ నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed