భారత ఒలంపిక్ క్రీడాకారులతో రాష్ట్రపతి భేటీ

by M.Rajitha |
భారత ఒలంపిక్ క్రీడాకారులతో రాష్ట్రపతి భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : పారిస్ ఒలంపిక్ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం రాష్ట్రపతి భవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారుల ప్రదర్శనను రాష్ట్రపతి అభినందించారు. ఒలంపిక్ ఆటగాళ్లు భారతదేశ యువతకు, విద్యార్థులకు.. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు స్పూర్తిగా నిలిచారని కొనియాడారు. ప్రతీ అథ్లెట్ తో రాష్ట్రపతి స్వయంగా మాట్లాడి ఒలంపిక్ లో జరిగిన క్రీడల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్నప్పటి నుండే పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని, ఈ విషయంలో తల్లిదండ్రులు చొరవ చూపాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. రాష్ట్రపతిని కలిసిన క్రీడాకారుల వెంట కేంద్ర క్రీడాశాఖ మంత్రి మనసుఖ్ మాండవీయ, భారత ఒలంపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష ఉన్నారు. పారిస్ ఒలంపిక్స్ లో భారత్ కు ఒక రజత పతకం, ఐదు కాంస్య పతకాలు సాధించారు.

Next Story

Most Viewed