Asifabad Collector : ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి..

by Aamani |
Asifabad Collector : ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి..
X

దిశ, ఆసిఫాబాద్ : ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో పథకం లబ్ధిదారులకు శిక్షణ అనంతరం బ్యాంకు రుణాల పై అధికారులు,అమలు కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కులవృత్తులకు చేయూత అందించేందుకు ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకాన్ని చేపట్టారన్నారు. టైలరింగ్, బార్బర్, భవన నిర్మాణ మేస్త్రిలుగా శిక్షణ అనంతరం కిట్లు అందించడంతో పాటు బ్యాంకు రుణ సదుపాయం కల్పించే విధంగా అధికారులు పని చేయాలని, అలాగే శిక్షణ సమయంలో స్టయిఫండ్ అందించేలా చూడాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 2 వేల 196 దరఖాస్తులు వచ్చాయని.. మొదటి దశలో జీపీ పరిధి లో 992 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, రెండవ దశలో 864 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన,. మూడవ దశలో 447 దరఖాస్తుల మంజూరుకు సిఫార్సు చేశామన్నారు. శిక్షణ కొరకు ఎంపికైన అభ్యర్థులకు ఆసిఫాబాద్, కాగజ్ నగర్ లలో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Next Story