వీణవంకలో దొంగల హల్‌చల్

by Aamani |
వీణవంకలో దొంగల హల్‌చల్
X

దిశ,వీణవంక : వీణవంక మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. స్థానిక నల్ల పోచమ్మ వైన్స్,శ్రీ వెంకటరమణ ఐరన్ అండ్ హార్డ్వేర్ లో చొరబడ్డారు. వైన్స్ లో 45 వేల విలువైన మద్యం బాటిల్స్,ఐరన్ షాప్ లో నగదు ఎత్తుకెళ్లారని, షట్టర్స్,సీసీ కెమెరాలు ధ్వంసం చేసి భారీ ఆస్తి నష్టం కలిగించారని నిర్వాహకులు తెలిపారు. దొంగలు తెలివిగా ఎవరి కంట పడకుండా రెండు చోట్ల సీసీ కెమెరాలు ధ్వంసం చేసి డివిఆర్ ఎత్తుకెళ్లారు. వైన్స్ యాజమని దాసం రఘుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తోట తిరుపతి తెలిపారు.

Next Story