హాలీవుడ్ హీరోలా మహేశ్ బాబు.. న్యూ లుక్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్

by sudharani |
హాలీవుడ్ హీరోలా మహేశ్ బాబు.. న్యూ లుక్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: ఈ ఏడాది ‘గుంటూరు కారం’తో ప్రేక్షకులను అలరించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తన తదుపరి చిత్రం దర్శకధీరుడు రాజమౌళితో చేయబోతున్న విషయం తెలిసిందే. ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్‌లో అత్యంత భారీగా ఉండనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారట. అంతే కాకుండా.. ఈ సినిమా కోసం మహేశ్ తన లుక్ కూడా మార్చినట్లు నెట్టింట వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీటినే నిజం చేస్తూ.. తాజాగా మహేశ్ దర్శనమిచ్చాడు. అయితే.. ఇటీవల ఏపీ, తెలంగాణలో కురిసిన వర్షాలకు కొన్ని ప్రాంతాలు జలమయమయిన సంగతి తెలిసిందే.

ఈ కారణంగా వరద బాధితులకు రాజకీయనాయకులతో సహా, సినీ ప్రముఖులు కూడా విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పుడు ప్రకటించిన విరాళానికి సంబంధించిన చెక్కులను ఇప్పుడు అందిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ప్రిన్స్ మహేశ్ బాబు, సతీమణి నమ్రత సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ. 50 లక్షల చెక్కును అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన ఫ్యాన్స్ మహేశ్ బాబు లుక్‌కు ఫిదా అవుతున్నారు. పొడుగు జుట్టు, గడ్డంతో దర్శనమిచ్చిన మహేశ్ హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తూ సందడి చేస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు.

Next Story

Most Viewed