Interesting: వ్యాపారంలో రంగుల పాత్ర ఉంటుందా? మనుషులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి?

by Sujitha Rachapalli |
Interesting: వ్యాపారంలో రంగుల పాత్ర ఉంటుందా? మనుషులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి?
X

దిశ, ఫీచర్స్ : రంగులు మానవ ప్రవర్తన, భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా? ఒక్కోసారి మనం వేసుకున్న దుస్తులు కూడా మనల్ని హ్యాపీగా ఉంచుతాయి. ఇందుకు మనకు నచ్చిన కలర్ లేదా మనకు సూట్ అయ్యే రంగు కలిగిన దుస్తులు లేదా ఆ కలర్ మన ఫేస్ పై గ్లో ఇచ్చేది అయ్యుండొచ్చు. ఈ రంగులు బేస్ చేసుకుని వ్యాపారాలు కూడా నడుస్తుండగా.. అసలు కలర్ సైకాలజీ ఎక్కడ, ఎలా ఉపయోగించబడుతుంది? మనిషి మూడ్ ఎలా ప్రభావితం చేస్తుంది అనేది తెలుసుకుందాం.

దేనికి సంకేతం?

1. రెడ్: శక్తి, అభిరుచి, అత్యవసరం

2. బ్లూ: నమ్మకం, ప్రశాంతత, విశ్వాసం

3. ఎల్లో: ఆనందం, ఆశావాదం, సృజనాత్మకత

4. గ్రీన్: ప్రకృతి, ఎదుగుదల, సామరస్యం

5. ఆరెంజ్: ప్రకంపన, ఉత్సాహం, వెచ్చదనం

6. పర్పుల్: లగ్జరీ, నాలెడ్జ్

కలర్ ఎమోషన్స్:

1. వార్మ్ కలర్స్ (ఎరుపు, నారింజ, పసుపు): శక్తి, స్ఫూర్తి

2. కూల్ కలర్స్ (బ్లూ, గ్రీన్, పర్పుల్): ప్రశాంతత, ఓదార్పు

3. బ్రైట్ కలర్స్: హ్యాపీనెస్, ప్లేఫుల్‌నెస్

4. డార్క్ కలర్స్: సీరియస్‌నెస్, సోఫిస్టికేషన్

రంగు కీలకం:

1. బ్రాండ్లు: కంపెనీ బ్రాండ్స్ తమ గుర్తింపుకు అనుగుణంగా రంగులను ఉపయోగిస్తాయి. ఎందుకంటే కలర్స్ బ్రాండ్ గుర్తింపును 80% పెంచుతాయి.

2. మార్కెటింగ్: మనుషుల్లో భావోద్వేగాలను రేకెత్తించే రంగులను ఎంచుకుంటాయి. కారణం 62-90% కొనుగోలు నిర్ణయాలు రంగుపై ఆధారపడి ఉంటాయి.

3. ఇంటీరియర్ డిజైన్: మానసిక స్థితి, వాతావరణాన్ని పెంచే రంగులను కలర్స్ చూజ్ చేసుకుంటారు.

4. ఆర్ట్: అర్థం, వ్యక్తీకరణను తెలియజేయడానికి ఉపయోగిస్తాయి. వివిధ సంస్కృతులు వివిధ అర్థాలతో రంగులను అనుబంధిస్తాయి.

Advertisement

Next Story

Most Viewed