Boddemma: బొడ్డెమ్మ ఎందుకు చేసుకుంటారు? బతుకమ్మకు ముందు వచ్చే దీని విశిష్టత ఏంటి?

by Anjali |
Boddemma: బొడ్డెమ్మ ఎందుకు చేసుకుంటారు? బతుకమ్మకు ముందు వచ్చే దీని విశిష్టత ఏంటి?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కొన్ని పండుగలకు ప్రత్యేక విశిష్టత కలిగి ఉంటుంది. సంసృతి సంప్రదాయాలు అన్ని ప్రకృతితో ముడిపడి ఉంటాయి. అలాంటి పండుగల్లో బొడ్డెమ్మ పండుగ ఒకటి. ఇది తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మకు ముందు వస్తుంది. బతుకమ్మకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో బొడ్డెమ్మకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు మహిళలు. బొడ్డెమ్మను ఆడవాళ్లు ఆడుతారు. బాలికల నుంచి పెద్ద వాళ్ల వరకు రాత్రి పూట ఆడుతుంటారు. దీన్ని మట్టితో తయారు చేస్తారు.

పలు రకాల పువ్వులతో అందంగా అలంకరిస్తారు. ఇప్పటికే తెలంగాణలో బొడ్డెమ్మ వేడుకలు స్టార్ట్ అయ్యాయి. భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమిని బొడ్డెమ్మ పున్నమి అని అంటారు. ఈ మట్టి పూల పండుగను సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకు ఆడుతారు. ఆ గల్లీలో ఉండే మహిళలంతా ఆటపాటల్లో పాల్గొంటారు. కొన్ని ఫ్యామిలీస్‌లో అయితే దీన్ని ఒక నోముగా కొలుస్తారు. వైవాహిక జీవితం బాగుండాలని గౌరీదేవికి నోము చేస్తారు. తొమ్మిదవ రోజు స్థానికంగా ఉన్న కుంటల్లో లేదా చెరువులో వినాయకుడి వలే నిమజ్జనం చేస్తారు.

బొడ్డెమ్మను రకరకాల పేర్లతో పిలుస్తారు. పీట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ, అంతరాల బొడ్డెమ్మ అనే పేర్లతో పిలుస్తారు. బొడ్డెమ్మను ఒక పీటపై తయారు చేస్తారు. పందిరి వేస్తారు. తొమ్మిదవ నాడు బియ్యంతో కుడుములు చేసి గౌరీదేవికి నైవేద్యంగా పెడతారు. తర్వాత పసుపు కుంకుమలు, అక్షింతలు, పూలతో పూజిస్తారు. ఆ రోజు కొంచెం ఎక్కువసేపు బొడ్డెమ్మ ఆడి.. పాటలు పాడి తర్వాత పోయిరా బొడ్డెమ్మ .. మళ్లొచ్చే ఏడాది మళ్లీ రా బొడ్డెమ్మ అంటూ చెరువులో వేస్తారు.

ఇక బొడ్డెమ్మ వేడుకలు పూర్తవ్వగానే నెక్ట్స్ డే అమావాస్య రోజున మహిళలకు ఇష్టమైన బతుకమ్మ పండుగ వేడుకలు స్టార్ట్ అవుతాయి. బతుకమ్మకు తొమ్మిది రోజులు ఆడవాళ్లంతా సెలబ్రేట్ చేసుకుంటారు. చివర రోజు అయితే మహిళలు పట్టు చీరలు, నగలు ధరించి అట్రాక్షన్‌గా నిలుస్తారు. బొడ్డెమ్మ నుంచి బతుకమ్మ వరకు 20 రోజులు మొత్తం పండుగ వాతావరణం ఉట్టిపడుతుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Next Story