ప్రజావాణిలో అత్యధికంగా ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్ పైనే..

by Sumithra |
ప్రజావాణిలో అత్యధికంగా ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్ పైనే..
X

దిశ, పేట్ బషీరాబాద్ : జంట సర్కిళ్ల జీహెచ్ఎంసి కార్యాలయాలలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 17 అర్జీలు వచ్చినట్లుగా అధికారులు పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంకి మొత్తం తొమ్మిది దరఖాస్తులు రాగా వాటిలో ఆరు ఫిర్యాదులు టౌన్ ప్లాన్ విభాగానికి చెందిన వి.కాగా టాక్స్, ఎంటమాలజీ, శానిటేషన్ విభాగానికి ఒక్కొక్క ఫిర్యాదు చొప్పున వచ్చాయి. గాజులరామారం సర్కిల్ కార్యాలయానికి మొత్తం ఎనిమిది ఫిర్యాదులు రాగా వాటిలో రెండు టౌన్ ప్లాన్ విభాగానికి చెందినవి కాగా ఇంజనీరింగ్ విభాగానికి 5, ఎలక్ట్రికల్ విభాగానికి ఒకటి చొప్పున అర్జీలు వచ్చినట్లు పేర్కొన్నారు.

చర్యలు తీసుకోకుండానే..

కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో ఆరు ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్ విభాగానికి వచ్చాయి. అయితే ఈ ఫిర్యాదుల్లో చాలావరకు పదికి పైనే ఈ విభాగానికి వచ్చినట్లు తెలుస్తుంది. ప్రజావాణిలో ఫిర్యాదులు ఇస్తున్నాము కానీ వాటిని ఏమాత్రం పరిష్కరించకుండానే కాలం వెలదీస్తున్నారంటూ ఫిర్యాదుదారులు డీసీ నరసింహ ముందు పేర్కొన్నారు. ప్రతివారం టౌన్ ప్లానింగ్ విభాగానికి వచ్చిన ఫిర్యాదులను ఒక్కసారి పరిశీలించి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే ఈ విషయం మీకు ఇట్టే అర్థమవుతుందని తెలిపారు. ఈ విషయం పై కమిషనర్ మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదులకు ఆయా నిర్మాణదారులకు నోటీసులు జారీ చేస్తున్నామని అవసరమైన మాటని టాస్క్ ఫోర్స్ విభాగానికి సిఫార్సు చేస్తున్నామని, ఇంతకుమించి మేము చేసేది ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే ఫిర్యాదులు వచ్చిన నిర్మాణాల పనులను కనీసం ఆపలేని పరిస్థితిలో కుత్బుల్లాపూర్ టౌన్ ప్లానింగ్ భాగం ఉన్నదని తీవ్రంగా విమర్శించారు ఫిర్యాదు దారులు.

Advertisement

Next Story

Most Viewed