MP Kiran: హెచ్‌సీఏలో అవినీతి.. టెండర్లు లేకుండా ఐపీఎల్ కాంట్రాక్టులు

by Gantepaka Srikanth |
MP Kiran: హెచ్‌సీఏలో అవినీతి.. టెండర్లు లేకుండా ఐపీఎల్ కాంట్రాక్టులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హెచ్‌సీఏ(HCA)లో అవినీతి జరిగిందని, వెంటనే ఎంక్వైరీ చేయాలని డైరెక్టరేట్ జనరల్ విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌కు ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) ఫిర్యాదు చేశారు. హెచ్‌సీఏలో క్యాటరింగ్, రవాణా సేవల టెండర్ ప్రక్రియపై యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నదని, ఇందులో అక్రమాలు జరిగాయన్నారు. అపెక్స్ కౌన్సిల్‌తో సరైన సంప్రదింపులు లేకుండానే ప్రెసిడెంట్, సెక్రటరీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని ఫిర్యాదులో వెల్లడించారు. టెండర్ లేకుండానే ఐపీఎల్ కాంట్రాక్టులు ఇవ్వడం ఏమిటని? ప్రశ్నించారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్ కూడా సర్య్యూలేట్ చేయకుండా జాగ్రత్త పడ్డారని స్పష్టం చేశారు. గతంలో టిక్కెట్ల అమ్మకాల్లోనూ తప్పిదాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయన్నారు. క్రీడాకారుల ఎంపికలోనూ నిర్లక్ష్యం జరిగిందని బాధితులు ధర్నా కూడా చేశారన్నారు. వీటన్నింటికి ప్రెసిడెంటే కారణమని వెల్లడించారు. వీటిపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు.

Advertisement

Next Story

Most Viewed