ఆటకు వీడ్కోలు పలికిన రోజే శ్రీజేష్‌కు గుడ్ న్యూస్ చెప్పిన హాకీ ఇండియా

by Harish |
ఆటకు వీడ్కోలు పలికిన రోజే శ్రీజేష్‌కు గుడ్ న్యూస్ చెప్పిన హాకీ ఇండియా
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో స్పెయిన్‌ను 2-1 తేడాతో చిత్తు చేసి పతకం సాధించింది. ఈ మ్యాచ్‌తో గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ హాకీకి వీడ్కోలు పలికాడు. సుదీర్ఘ 18 ఏళ్ల కెరీర్‌లో జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన అతను కాంస్యంతో ఘనంగా గుడ్ బై చెప్పాడు. అయితే, అతని సేవలను హాకీ ఇండియా ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఆటగాడిగా ముగింపు పలికిన రోజే శ్రీజేష్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు‌కు శ్రీజేష్‌ను హెడ్ కోచ్‌గా నియమించింది. ఈ విషయాన్ని బ్రాంజ్ మెడల్ మ్యాచ్ అనంతరం హాకీ ఇండియా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘జూనియర్ పురుషుల హాకీ జట్టు‌కు కొత్త హెడ్ కోచ్‌గా శ్రీజేష్ నియామకమయ్యాడు. ఆట నుంచి కోచింగ్ వరకు మీరు యువతలో స్ఫూర్తి నింపుతూనే ఉంటారు.’అని తెలిపింది.

Advertisement

Next Story