- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IND vs AUS: అహ్మదాబాద్ టెస్టు మ్యాచ్‌ను వీక్షించనున్న ప్రధాని మోదీ..
దిశ, వెబ్‌డెస్క్: ఫిబ్రవరి 9 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్ట్‌ల సిరీస్ జరగనుంది. ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్ వేదికగా జరగనున్న తొలి టెస్ట్‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. టీమిండియా నాగ్ పూర్ ప్రాక్టీస్ క్యాంప్‌లో పాల్గొంది. రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అయితే ఈ సిరీస్ చివరి మ్యాచ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు.
అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు భారత ప్రధానితో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా హాజరవుతారని బోర్డు వర్గాలు తెలిపాయి. మార్చి 9-13 వరకు జరిగే ఈ మ్యాచ్‌ను ఇద్దరు ప్రధానులు ప్రత్యక్షంగా వీక్షిస్తారని పేర్కొన్నాయి. ఫిబ్రవరి 9- 13 మధ్య నాగ్‌పూర్ వేదికగా తొలి టెస్ట్ జరగనుండగా.. ఫిబ్రవరి 17-21 మధ్య ఢిల్లీ వేదికగా రెండో టెస్ట్, మార్చి 1-5 ధర్మశాల వేదికగా మూడో టెస్ట్, మార్చి 9- 13: అహ్మదాబాద్ వేదికగా చివరి టెస్ట్ జరగనుంది.