పారాలింపిక్స్ క్లోజింగ్ సెర్మనీలో భారత పతకధారులుగా హర్విందర్, ప్రీతి

by Harish |   ( Updated:2024-09-06 14:00:13.0  )
పారాలింపిక్స్ క్లోజింగ్ సెర్మనీలో భారత పతకధారులుగా హర్విందర్, ప్రీతి
X

దిశ, స్పోర్ట్స్ : భారత పారా అథ్లెట్లు ఆర్చర్ హర్విందర్ సింగ్, స్ప్రింటర్ ప్రీతి పాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. పారిస్‌లో ఆదివారం జరిగే పారాలింపిక్స్ ముగింపు వేడుకల్లో వీరిద్దరూ భారత పతకధారులుగా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని భారత బృందం చెఫ్ డె మిషన్ సత్య ప్రకాశ్ సంగ్వాన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. హర్విందర్, ప్రీతి ప్రదర్శన భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచిందని ప్రశంసించారు. పారిస్ పారాలింపిక్స్‌లో హర్విందర్ సింగ్ స్వర్ణ పతకం గెలిచాడు. టోక్యోలో కాంస్యం నెగ్గిన అతను ఈ సారి గోల్డ్ మెడల్ సాధించడంతోపాటు తొలి బంగారు పతకం కైవసం చేసుకున్న మొదటి భారత ఆర్చర్‌గా చరిత్ర సృష్టించాడు. మరోవైపు, ప్రీతి 100 మీటర్ల టీ35, 200 మీటర్ల టీ35 ఈవెంట్లలో కాంస్యాలు గెలుచుకుంది. ప్రారంభ వేడుకల్లో జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, మహిలా షాట్‌పుటర్ భాగ్యశ్రీ జాదవ్ భారత బృందాన్ని నడిపించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed