ఈఫిల్ టవర్ మెటల్‌తో ఒలింపిక్స్ పతకాలు

by Harish |
ఈఫిల్ టవర్ మెటల్‌తో ఒలింపిక్స్ పతకాలు
X

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది జరగబోయే పారిస్ ఒలింపిక్స్‌ సమయం దగ్గరపడుతున్నది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ అంతర్జాతీయ ఈవెంట్‌కు ఇంకా ఐదు నెలలు మాత్రమే ఉన్నాయి. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఒలింపిక్స్‌కు ఫ్రాన్స్ ఆతిథ్యమిస్తున్నది. ఒలింపిక్స్‌కు ఫ్రాన్స్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి. విజేతకు స్వర్ణంతోపాటు రెండు, మూడు స్థానాల్లో నిలిచిన వారికి రజతం, కాంస్య అందజేస్తారన్న విషయం తెలిసిందే. తాజాగా విజేతలకు అందజేసే పతకాలను నిర్వాహకులు రిలీజ్ చేశారు. గురువారం మెడల్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సారి మెగా ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణ తేవాలని నిర్వాహకులు భావిస్తున్నారు.

ప్రపంచ వింతల్లో ఒక్కటైన ఈఫిల్ టవర్‌ ఇనుమును పతకాలను రూపొందించారు.. ‘పారిస్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ పతక విజేతలకు ఈఫిల్ టవర్ ముక్కను అందించాలనుకుంటున్నా.’ అని పారిస్ ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ హెడ్ టోనీ ఎస్టాంగ్యూట్ తెలిపారు. ఈఫిల్ టవర్‌ నుంచి తీసుకున్న మెటల్‌ను ప్రతి పతకంలో 18 గ్రాముల ముక్కను పొదిగించనున్నారు. పతకం షడ్బుజి ఆకారంలో ఉంటుంది. దాని చుట్టూ నీలి రంగు పట్టితోపాటు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ కప్పబడి ఉంటాయి. పారిస్ ఒలింపిక్స్‌లో అందజేసే పతకాలను ఫ్రెంచ్ జ్యువెలరీ హౌజ్ చౌమెట్ రూపొందించింది. ఈ ఈవెంట్‌లో మొత్తం 5, 084 పతకాలు అందజేయనున్నారు. పారిస్ పారాలింపిక్స్‌లోనే ఈ పతకాలనే అందజేయనున్నారు.

Advertisement

Next Story