- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త చరిత్ర లిఖించిన పారా అథ్లెట్లు.. రికార్డు స్థాయిలో 29 పతకాలు
దిశ, స్పోర్ట్స్ : పారిస్ పారాలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్లు కొత్త చరిత్ర లిఖించారు. 25 పతకాలు లక్ష్యంగా పారిస్‌లో అడుగుపెట్టిన పారా వీరులు అంచనాలకు మించి సత్తాచాటారు. టోక్యో పారాలింపిక్స్‌లో రెండెంకల పతక కలను నిజం చేసిన మన పారా అథ్లెట్లు ఈ సారి అంతకుమించి పతక మోత మోగించారు. ఇంతకుముందు పారాలింపిక్స్ చరిత్రలో టోక్యోలో దక్కిన 19 పతకాలే భారత్ అత్యుత్తమ ప్రదర్శనగా ఉండగా.. పారిస్‌లో దాన్ని అధిగమించారు. రికార్డు స్థాయిలో 29 పతకాలు సొంతం చేసుకున్నారు. అందులో 7 స్వర్ణాలు ఉండటం విశేషం. 8 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి. పారిస్ పారాలింపిక్స్‌లో ఆదివారంతో భారత్ ప్రయాణం ముగిసింది.
అథ్లెటిక్స్‌లో అత్యధికం
భారత్ పతక పంటలో అథ్లెటిక్స్‌లోనే ఎక్కువ మెడల్స్ వచ్చాయి. 29 పతకాల్లో 17 దక్కాయి. స్వర్ణాల్లోనూ ఆ క్రీడా విభాగానిదే అగ్రస్థానం. 7 బంగారు పతకాల్లో 4 స్వర్ణాలు వచ్చాయి. ఆ తర్వాతి స్థానం బ్యాడ్మింటన్‌ది. పారా షట్లర్లు ఒక స్వర్ణంసహా ఐదు మెడల్స్ గెలిచారు. ఆ తర్వాత షూటింగ్‌లో నాలుగు, ఆర్చరీలో రెండు, జూడోలో ఒకటి దక్కాయి.
11 ఎడిషన్లలో 12.. రెండు ఎడిషన్లలోనే 48
పారాలింపిక్స్‌ల్లో భారత్ ప్రదర్శన మెరుగుపడుతుందని చెప్పే విశ్వక్రీడలు ఇవి. 1968 నుంచి భారత్ సమ్మర్ పారాలింపిక్స్‌లో పాల్గొంటుంది. 1972 విశ్వక్రీడల్లో పారా స్విమ్మర్ మురళీకాంత్ పేట్కర్ దేశానికి తొలి పతకం(స్వర్ణం) అందించారు. టోక్యో, పారిస్ పారాలింపిక్స్‌లకు ముందు 11 ఎడిషన్లలో భారత్ సాధించిన పతకాలు 12 మాత్రమే. కేవలం టోక్యో, పారిస్ పారా విశ్వక్రీడల్లోనే వచ్చిన పతకాలు 48. పారిస్‌లో 29 పతకాలతో భారత్.. స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా, బెల్జియం, అర్జెంటీనా వంటి దేశాలను వెనక్కినెట్టి మెడల్స్ టేబుల్‌లో టాప్-20లో నిలిచింది.
పతక వీరులు వీరే
స్వర్ణం
1. హర్విందర్ సింగ్(ఆర్చరీ, పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్)
2. ప్రవీణ్ కుమార్(అథ్లెటిక్స్, పురుషుల హైజంప్ టీ64)
3. నవ్‌దీప్(అథ్లెటిక్స్, పురుషుల జావెలిన్ త్రో ఎఫ్41) - స్వర్ణం
4. సుమిత్(అథ్లెటిక్స్, పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46) - స్వర్ణం
5.ధరంబిర్(అథ్లెటిక్స్, పురుషుల క్లబ్ ఎఫ్51) - స్వర్ణం
6. నితేశ్ కుమార్(బ్యాడ్మింటన్, పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్3) - స్వర్ణం
7. అవనీ లేఖరా(షూటింగ్, ఆర్2 మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1) - స్వర్ణం
రజతం
8. నిశాద్ కుమార్(అథ్లెటిక్స్, పురుషుల హైజంప్ టీ47)
9.శరద్ కుమార్(అథ్లెటిక్స్, పురుషుల హైజంప్ టీ63)
10.సచిన్ సర్జెరావు ఖిలారీ(అథ్లెటిక్స్, పురుషుల షాట్‌పుట్ ఎఫ్46)
11.యోగేశ్ కతునియా(అథ్లెటిక్స్, పురుషుల డిస్కస్ త్రో ఎఫ్56)
12. అజీత్ సింగ్(అథ్లెటిక్స్, పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46)
13. ప్రణవ్ సూర్మ(అథ్లెటిక్స్, పురుషుల క్లబ్ త్రో ఎఫ్51)
14.సుహాస్ యతిరాజ్(బ్యాడ్మింటన్, మహిళల సింగిల్స్ ఎస్‌ఎల్ 4)
15. తులసిమతి మురుగేసన్(బ్యాడ్మింటన్, మహిళల సింగిల్స్ ఎస్‌యూ5)
16.మనీశ్ నర్వాల్(షూటింగ్, పీ1-పురుషుల 10మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఎస్‌హెచ్1)
కాంస్యం
17.మోనా అగర్వాల్(షూటింగ్, ఆర్2 మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1)
18.రుబీనా ఫ్రాన్సిస్(షూటింగ్, పీ2 మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఎస్‌హెచ్1)
19. కపిల్ పర్మార్(జూడో, పురుషుల 60 కేజీ జె1)
20. నిత్యశ్రీ(బ్యాడ్మింటన్, మహిళల సింగిల్స్ ఎస్‌హెచ్6)
21. మనీషా రామదాస్(బ్యాడ్మింటన్, మహిళల సింగిల్స్ ఎస్‌యూ5)
22.దీప్తి జీవాంజి(అథ్లెటిక్స్, మహిళల 400 మీటర్ల టీ20)
23.ప్రీతి పాల్(అథ్లెటిక్స్, మహిళల 200 మీటర్ల టీ35)
24.ప్రీతి పాల్(అథ్లెటిక్స్, మహిళల 100 మీటర్ల టీ35)
25. సిమ్రాన్(అథ్లెటిక్స్, మహిళల 200 మీటర్ల టీ12)
26. గుర్జార్ సుందర్ సింగ్(అథ్లెటిక్స్, పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46)
27. హొకాటో హొటోజి సెమా (అథ్లెటిక్స్, పురుషుల షాట్ పుట్ ఎఫ్57)
28.మరియప్పన్ తంగవేలు(అథ్లెటిక్స్, పురుషుల హైజంప్ టీ63)
29.రాకేశ్ కుమార్/శీతల్ దేవి(ఆర్చరీ, మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్)
- Tags
- #Paralympics