- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత్ ఖాతాలో మరో ఐదు పతకాలు
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : ఢిల్లీలో జరుగుతున్న పారా షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత పారా షూటర్ల పతకాల పంట కొనసాగుతోంది. సోమవారం మరో ఐదు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. పీ4 మిక్స్‌డ్ 50 మీటర్ల పిస్టోల్ ఎస్‌హెచ్1 వ్యక్తిగత ఈవెంట్‌లో రుద్రాన్ష్ ఖండేల్వాల్ 223.2 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజతం సాధించాడు. అదే కేటగిరీలో మరో భారత షూటర్ నిహాల్ సింగ్(202.8 స్కోరు) కాంస్యం గెలుచుకున్నాడు. ఇదే కేటగిరీ టీమ్ ఈవెంట్‌లో రుద్రాన్ష్, నిహాల్, సింఘ్‌రాజ్ త్రయం రజతం దక్కించుకుంది. అలాగే, పీ6 మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్‌లో మనీశ్ నర్వాల్-రుబినా ఫ్రాన్సిస్ జోడీ రజతం సాధించగా.. రుద్రాన్ష్-శక్తి జంట కాంస్య పతకం గెలుచుకుంది.
Advertisement
Next Story