- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షూటర్ పాలక్‌కు ఒలింపిక్స్ బెర్త్
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : భారత షూటర్ పాలక్ గులియా 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ కేటగిరీలో పారిస్ ఒలింపిక్స్ బెర్త్ సాధించింది. బ్రెజిల్‌లో జరుగుతున్న ఫైనల్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ చాంపియన్‌షిప్‌లో ఆదివారం ఆమె కాంస్య పతకం సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఫైనల్‌లో పాలక్ 217.6 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. దీంతో బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకోవడంతోపాటు భారత్‌కు 20వ ఒలింపిక్ కోటాను అందించింది. అదే ఈవెంట్‌లో మరో భారత క్రీడాకారిణి సైన్యం 176.7 స్కోరుతో ఐదో స్థానంలో నిలిచింది. పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో ప్రతి దేశం గరిష్టంగా 24 కోటాలు పొందొచ్చు. రైఫిల్, పిస్టోల్ కేటగిరీలో భారత ఇప్పటికే గరిష్టంగా 16 కోటాలను పొందింది. మిగతా నాలుగు బెర్త్‌లను షాట్‌గన్ కేటగిరీలో సాధించాల్సి ఉంది.
Advertisement
Next Story