Majid Ali: పాక్ యువ స్నూకర్‌ సూసైడ్..

by Vinod kumar |
Majid Ali: పాక్ యువ స్నూకర్‌ సూసైడ్..
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్‌కు చెందిన అంతర్జాతీయ‌ స్నూకర్‌ స్టార్‌ , అండర్‌-21 మెడలిస్ట్‌ మాజిద్‌ అలీ సూసైడ్ చేసుకున్నాడు. గురువారం రాత్రి పంజాబ్‌(పాకిస్తాన్‌)లోని ఫైసలాబాద్‌లో తన ఇంట్లోనే రంపం మెషిన్‌తో ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. అయితే కొంతకాలంగా మాజిద్‌ అలీ మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు పోలీసులు నిర్థారించారు. అతనికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని.. నిరాశ నిసృహల్లో కూరుకుపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, పాకిస్తాన్‌ తరపున చిన్న వయసులోనే స్నూకర్‌ గేమ్‌(బిలియర్డ్స్‌)లో సంచలనాలు సృష్టించిన మాజిద్‌ అలీ జాతీయ స్థాయిలో చాలాకాలం పాటు నెంబర్‌వన్‌గా కొనసాగాడు.

Advertisement

Next Story

Most Viewed