- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL కంటే మా పాకిస్థాన్ లీగే బెటర్: మహ్మద్ రిజ్వాన్ షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ ఓపెనర్, స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఐపీఎల్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కంటే.. పాకిస్థాన్ సూపర్ లీగ్ ఎంతో కఠినమని.. ప్రపంచంలో పీఎస్ఎల్ లీగ్ ఆడిన ఏ ప్లేయర్లను అడిగినా ఇదే విషయం చెబుతారని రిజ్వాన్ పేర్కొన్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ సక్సెస్ కాదని మొదట్లో ఎంతో మంది అన్నారని.. కానీ పీఎస్ఎల్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిందని అన్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ ఎంతో సక్సెస్ అయ్యిందని.. ఒక ప్లేయర్లగా ఈ విషయాన్ని ఎంతో గర్వంగా చెబుతున్నానని అన్నాడు. పాకిస్థాన్ జట్టుకు ఈ స్థాయిలో నాణ్యమైన బ్యాకప్ ప్లేయర్స్ అందుతున్నారంటే.. ఈ క్రెడిట్ పాకిస్థాన్ సూపర్ లీగ్‌కే దక్కుతుందని సొంత దేశ లీగ్‌ను రిజ్వాన్ ఆకానికెత్తాడు.
ఇక, పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ జట్టుకు మహ్మద్ రిజ్వాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ముల్తాన్ సుల్తాన్స్ టీమ్‌కు కెప్టెన్ వ్యవహరిస్తున్న రిజ్వాన్.. 2021లో తన జట్టుకు టైటిల్ అందించాడు. ఇదిలా ఉంటే, ప్రపంచలోనే అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాలని ప్రతి ప్లేయర్లు కలలు కంటాడు. ఒక్క ఐపీఎల్ సీజన్‌లో రాణిస్తే ఆటగాళ్ల రాతే మారిపోతుంది అంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఐపీఎల్‌లో ఆడేందుకు అన్ని దేశాల క్రికెటర్లు ఆసక్తి కనబరుస్తారు. అంతటి ప్రేక్షకాదరణతో దూసుకుపోతున్న ఐపీఎల్‌పై మహ్మద్ రిజ్వాన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.