సెలెక్టర్ల దృష్టిలో అతడు తప్పక ఉంటాడు : Robin Uthappa

by Vinod kumar |
సెలెక్టర్ల దృష్టిలో అతడు తప్పక ఉంటాడు : Robin Uthappa
X

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్‌ పర్యటనలో అరంగేట్రం చేసి అదరగొట్టేసిన భారత యువ బ్యాటర్ తిలక్‌ వర్మ ఆటతీరుపై అందరిలోనూ చర్చ మొదలైంది. భవిష్యత్తులో కీలక ప్లేయర్‌గా ఎదుగుతాడని ప్రశంసలు కురిపించారు. తాజాగా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కూడా అభినందిస్తూనే ఆసక్తికర కామెంట్స్ చేశాడు. వచ్చే వన్డే ప్రపంచకప్‌ కోసం 4వ స్థానంలో ఆడే ఆటగాడి కోసం సెలెక్టర్ల దృష్టి తప్పకుండా తిలక్‌ వర్మపై ఉండే అవకాశం ఉందని రాబిన్ ఉతప్ప అభిప్రాయపడ్డాడు. పరిస్థితులకు తగ్గట్టుగా జట్టు కోసం ఆడేవారిని పరిగణనలోకి తీసుకోవాలి. అందులో తొలుత తిలక్‌ వర్మ గురించి తప్పకుండా చర్చిస్తారని భావిస్తున్నా. అంతేకాకుండా ఎడమచేతివాటం బ్యాటర్‌ కావడం కూడా కలిసి రావచ్చు’’ అని ఉతప్ప వ్యాఖ్యానించాడు.

Advertisement

Next Story

Most Viewed