సచిన్ టెండూల్కర్ కాదు.. ఇప్పుడు సచిన్ దాస్ ట్రేండింగ్

by Mahesh |
సచిన్ టెండూల్కర్ కాదు.. ఇప్పుడు సచిన్ దాస్ ట్రేండింగ్
X

దిశ, వెబ్ డెస్క్: భారత క్రికెట్ లో ఎంతో మంది ప్లేయర్లు ఉన్నప్పటికి మనకు క్రికెట్ అంటే గుర్తొచ్చేది సచిన్ పేరు మాత్రమే. అతి చిన్న వయస్సులో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన సచిన్ దాదాపు నలభై సంవత్సరాలు దేశం కోసం ఆడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సచిన్ టెండూల్కర్, బదులుగా సచిన్ దాస్ అనే ప్రేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న 2024 అండర్ 19 వరల్డ్ కప్ లో సచిన్ దాస్ అనే యువ బ్యాటర్ చిచ్చరపిడుగులా చెలరేగిపోయి ఆడుతున్నాడు.

ఈ క్రమంలోనే మంగళవారం సౌతాఫ్రికా జట్టుతో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి ఫైనల్ లోకి దూసుకెళ్లింది. కాగా ఈ మ్యాచ్ లో యువ బ్యాటర్ సచిన్ దాస్.. నిలకడగా రాణిస్తూ.. జట్టు విజయం కోసం.. చివరి వరకు పోరాడాడు. ఇందులో భాగంగా 95 బంతుల్లో 11 ఫోర్లు 1 సిక్సర్‌తో 96 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో సచిన్ దాస్ ఉదయ్ శరన్ ల పాట్నర్‌షిప్ వలను మ్యాచ్ విజయం సాధించి ఫైనల్ చేరుకుంది.

ఇదిలా ఉంటే.. ఈ సీజన్ లో సచిన్ దాస్ ఆరు మ్యాచులు ఆడి 73.50 ఆవరేజ్ స్కోరుతో.. 294 పరుగులు చేశాడు. ఇవి కూడా ప్రతి మ్యాచులోను జట్టు విజయం కోసం అవసరమైన పరుగులే కావడం విశేషం. ముఖ్యంగా సెమీఫైనల్ మ్యాచ్‌లో ఓ పక్క వికెట్లు పడుతున్నప్పటికి బయపడకుండా నిలకడగా రాణించిన తీరు.. అందరని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తలపించింది. ఈ కారణంతోనే ప్రస్తుతం అతను సచిన్ తర్వాత అంతటి స్టార్ ప్లేయర్ అవుతాడని సోషల్ మీడియాలో చర్చకు దారి తీశారు. అలాగే పలు కీలక మ్యాచుల్లో.. ఓటమి అంచునుంచి భారత జట్టుకు విజయాలు అందించిన యువరాజ్, గంభీర్, కోహ్లీ, రోహిత్, ధోనీ, జడేజా.. వంటి ప్లేయర్లతో సచిన్ దాస్ ను పోలుస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed