స్టేడియాల్లో అలాంటి యాడ్స్ బంద్ చేయండి.. బీసీసీఐని ఆదేశించనున్న కేంద్రం?

by Harish |
స్టేడియాల్లో అలాంటి యాడ్స్ బంద్ చేయండి.. బీసీసీఐని ఆదేశించనున్న కేంద్రం?
X

దిశ, స్పోర్ట్స్ : గతేడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో 17 మ్యాచ్‌ల్లో పొగ రహిత పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన యాడ్స్‌ను ప్రదర్శించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్), వైటల్ స్ట్రాటజీస్ అధ్యయనం పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ స్టేడియాల్లో పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన యాడ్స్‌, హోర్డింగ్స్‌ను నిలిపివేయాలని బీసీసీఐని ఆదేశించినున్నట్టు తెలుస్తోంది. ‘క్రికెట్ మ్యాచ్‌లంటే యువతకు క్రేజ్. క్రికెట్ మ్యాచ్‌ల్లో స్మోక్ లెస్ టొబాకో యాడ్స్ ప్రదర్శించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సెలెబ్రిటీలు కూడా ఆ యాడ్స్‌లో ఉన్నారు. ఇది పరోక్షంగా యూత్‌పై ప్రభావం చూపుతోంది. కాబట్టి, పొగాకు సంబంధించిన ప్రకటనలను నిలిపివేయాలని ఆరోగ్య శాఖ బీసీసీఐని కోరనుంది.’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, సిగరెట్స్ అండ్ ఇతర టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్, కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ రూల్స్ ప్రకారం.. పొగాకు సంబంధిత యాడ్స్‌పై నిషేధం ఉంది. సినిమాలు, టెలివిజన్ లేదా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అటువంటి ప్రకటనలను ప్రసారం చేయడానికి వీల్లేదు.

Advertisement

Next Story

Most Viewed