- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏ బౌలర్ మూడు ఫార్మాట్లలో ఆడలేడు: విండీస్ బౌలర్ కామెంట్
దిశ, వెబ్ డెస్క్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా గత ఏడెనిమిది నెలలుగా క్రికెట్ నుంచి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో అతడు భారత జట్టులో చోటు దక్కించుకున్నా శ్రీలంకతో వన్డే సిరీస్ ముందు మళ్లీ గాయంతో అతడిని తప్పించారు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆడతాడని భావించినా అదీ జరగలేదు. కాగా, బుమ్రాపై తాజాగా వెస్టిండీస్ దిగ్గజ పేసర్ ఇయాన్ బిషప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.బుమ్రా మ్యాచ్ విన్నర్ అని.. భారత విజయాల్లో అతడు కీలక పాత్ర పోషించాడని చెప్పాడు.
ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిషప్ బుమ్రా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా బిషఫ్ మాట్లాడుతూ బుమ్రా బౌలింగ్ లో మంచి పేస్ ఉంటుందన్నాడు. అతడు మ్యాచ్ విన్నరని, మ్యాచ్ ను ఏ క్షణంలో అయినా మార్చేయగల సత్తా అతనుకుందన్నారు. చాలాకాలంగా అతడు భారత జట్టు విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలిపాడు. రాబోయే రోజుల్లో కూడా అతడి ఫిట్నెస్ పై భారత విజయాలు ఆధారపడి ఉంటాయని తెలిపాడు. దీనిని పరిగణనలోకి తీసుకుని అతడు కొన్ని మ్యాచ్ లు కోల్పోయినా ఫర్లేదు గానీ బుమ్రాకు విశ్రాంతినివ్వాలి ఇవ్వాలన్నాడు.
ఫాస్ట్ బౌలర్లకు రెస్ట్ చాలా అవసరం. ఏ బౌలర్ కూడా మూడు ఫార్మాట్లలో సుదీర్ఘకాలం కొనసాగలేడు. నేను కూడా రెండు ఫార్మాట్లు ఆడాను. ఆ సమమంలో నన్ను కూడా వెన్నునొప్పి సమస్యలు చాలా వేధించాయని తెలిపాడు. ఇప్పుడున్న బౌలర్లలో మిచెల్ స్టార్క్, జోఫ్రా ఆర్చర్ వంటి వాళ్లను చూడండి. వాళ్లు మూడు ఫార్మాట్లలో ఆడేవాళ్లు కాదు. స్టార్క్ కేవలం ఆస్ట్రేలియా తరఫున వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడతాడు. లీగ్ లు, ప్రధాన టోర్నీలు ఉన్నా తనకు శరీరం సహకరించకుంటే తప్పుకుంటాడు. అందుకే ఇప్పటికీ అతడిలో అంత పేస్ ఉంది.
బుమ్రా కూడా సుదీర్ఘకాలం కొనసాగాలంటే అతడికీ విశ్రాంతి అవసరమని బిషప్ తెలిపాడు. కాగా, ఐదు నెలలుగా గాయంతో సతమతమవుతున్న బుమ్రా తాజాగా ఐపీఎల్ నుంచి కూడా తప్పుకున్న విషయం తెలిసిందే. వెన్నునొప్పి నుంచి కోలుకున్నా బౌలింగ్ చేయడానికి బుమ్రా ఇంకా ఇబ్బందులు పడుతున్నాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ను దృష్టిలో ఉంచుకుని అతడిని ఐపీఎల్ కు పక్కనబెట్టడమే బెటర్ అనే భావనలో బీసీసీఐ కూడా ఉంది.