- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nicholas Pooran : T20ల్లో మరో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన నికోలస్ పూరన్
దిశ, వెబ్‌డెస్క్:వెస్టిండీస్(West Indies) వికెట్ కీపర్ నికోలస్ పూరన్(Nicholas Pooran) ఈ ఏడాది టీ20ల్లో పరుగుల వరద పారిస్తున్నాడు.ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్(Caribbean Premier League)లో ట్రిన్ బాగో నైట్ రైడర్స్(Trinbago Knight Riders) తరుపున ఆడుతున్న పూరన్ శనివారం బార్బడోస్ రాయల్స్(Barbados Royals)తో జరిగిన మ్యాచ్‌లో అరుదైన ఘనతను సాధించాడు.ఈ మ్యాచ్‌లో 27 పరుగులు చేసిన పూరన్ ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు .పూరన్ ఈ ఏడాది ఇప్పటివరకు 2,059 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పాక్(PAK) బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్(2,036 పరుగులు) రికార్డును బ్రేక్ చేశాడు.కాగా పూరన్ ఇటీవలే T20 ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..
- నికోలస్ పూరన్(West Indies)- 65 ఇన్నింగ్స్‌లలో 2,059 పరుగులు(2024)
- మహ్మద్ రిజ్వాన్(Pakistan) - 45 ఇన్నింగ్స్‌లలో 2,036 పరుగులు(2021)
- అలెక్స్ హేల్స్(England)- 61 ఇన్నింగ్స్‌లలో 1,946 పరుగులు (2022)
- జాస్ బట్లర్(England) - 55 ఇన్నింగ్స్‌లలో 1,833 పరుగులు(2023)
- మహ్మద్ రిజ్వాన్(Pakistan) - 44 ఇన్నింగ్స్‌లలో 1,817 పరుగులు(2022)