- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కివీస్ బౌలర్ల ధాటికి తడబడిన ఆసిస్.. శతకంతో ఆదుకున్న గ్రీన్
దిశ, స్పోర్ట్స్ : ఆతిథ్య న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియాను కామెరూన్ గ్రీన్ ఆదుకున్నాడు. అతను శతకంతో అజేయంగా నిలవడంతో మొదటి రోజు ముగిసే సమయానికి ఆ జట్టు 297/9 స్కోరుతో నిలిచింది. వెల్లింగ్టన్ వేదికగా గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో టాస్ ఓడిన ఆసిస్ మొదట తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించగా కివీస్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని నిలువరించారు. ఓపెనర్లు స్టీవ్ స్మిత్(31), ఉస్మాన్ ఖవాజా(33) స్వల్ప స్కోరుకే అవుటవ్వగా.. లబుషేన్(1), ట్రావిస్ హెడ్(1) నిరాశపరిచారు. దీంతో 89/4 స్కోరుతో ఆసిస్ కష్టాల్లో పడగా గ్రీన్ జట్టుకు అండగా నిలిచాడు. మిచెల్ మార్ష్(40) దూకుడుగా ఆడే క్రమంలో వికెట్ పారేసుకోగా.. అలెక్స్ కేరీ(10), మిచెల్ స్టార్క్(9), కెప్టెన్ పాట్ కమిన్స్(16), నాథన్ లైయన్(5) క్రీజులో నిలువలేకపోయారు. ఈ పరిస్థితుల్లో జట్టు భారాన్ని గ్రీన్ తన భుజాలపై మోశాడు. 155 బంతుల్లో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 4 వికెట్లతో సత్తాచాటగా.. విలియం ఒరొర్కె, స్కాట్ రెండేసి వికెట్లతో రాణించారు.