- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలి టెస్టు ఆసిస్‌దే.. న్యూజిలాండ్‌పై భారీ విజయం
దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్ గడ్డపై ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన కంగారులు టెస్టు సిరీస్‌లోనూ శుభారంభం చేశారు. కివీస్‌ను చిత్తు చేస్తూ ఆస్ట్రేలియా తొలి టెస్టును కైవసం చేసుకుంది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో 172 పరుగుల తేడాతో ఆదివారం ఆసిస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన కంగారులు నాలుగు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించారు. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో కంగారుల జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆస్ట్రేలియా నిర్దేశించిన 369 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 196 పరుగులకే కుప్పకూలింది. ఓవర్‌నైట్ స్కోరు 111/3తో ఆదివారం ఛేదనను కొనసాగించిన కివీస్ మరో 85 పరుగులు మాత్రమే జోడించి 7 వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్ నాథన్ లైయన్ ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. లైయన్ 6 వికెట్లతో చెలరేగడంతో కివీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. రచిన్ రవీంద్ర(59) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా వారు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ ఓటమిని చవిచూసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకంతో ఆసిస్‌ను ఆదుకున్న కామెరూన్ గ్రీన్(174)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ నెల 8 నుంచి రెండో టెస్టు ప్రారంభంకానుంది.
రెండు దశాబ్దాలుగా సుదీర్ఘ ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌పై ఆసిస్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇరు జట్లు ఇప్పటివరకు 20 టెస్టుల్లో తలపడగా ఆసిస్‌కు ఇది 17వ విజయం. ఒక్క మ్యాచ్‌లో మాత్రం కివీస్ చేతిలో ఆస్ట్రేలియా పరాజయం పాలైంది. రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.