New Zealand vs Afghanistan: రహ్మనుల్లా గుర్బాజ్‌కు ఉద్వాసన.. న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టుకు జట్టుని ప్రకటించిన అఫ్గనిస్తాన్‌

by Maddikunta Saikiran |
New Zealand vs Afghanistan: రహ్మనుల్లా గుర్బాజ్‌కు ఉద్వాసన.. న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టుకు జట్టుని ప్రకటించిన అఫ్గనిస్తాన్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 9 నుంచి న్యూజిలాండ్‌(New Zealand)తో ప్రారంభం కానున్న ఏకైక టెస్టుకు అఫ్గనిస్తాన్‌(Afghanistan) క్రికెట్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. హష్మతుల్లా షాహిద్‌(Hashmatullah Shahidi) కెప్టెన్సీలోని ఈ టెస్ట్ టీమ్‌లో మొత్తంగా పదహారు మందిని సెలెక్ట్ చేశారు. ఇందులో ముగ్గురు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు ఖలీల్‌ అహ్మద్‌, షామ్స్‌ ఉర్‌ రహమాన్‌, రియాజ్‌ హసన్‌ను తొలిసారి జట్టుకు ఎంపికచేసినట్లు అఫ్గన్‌ క్రికెట్ బోర్డు పేర్కొంది.అయితే, రషీద్‌ ఖాన్‌ లేకుండానే అఫ్గన్‌ జట్టు బరిలోకి దిగుతోంది. గాయం కారణంగా స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు.ఈ క్రమంలో అఫ్గన్‌ బోర్డు ఆచితూచి జట్టును ఎంపిక చేసుకుంది.పటిష్ఠమైన న్యూజిలాండ్‌ను ఢీకొట్టేందుకు అఫ్గనిస్తాన్‌ అన్ని రకాలుగా సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో రహ్మత్‌ షా,ఇబ్రహీం జద్రాన్‌ వంటి టాప్‌ బ్యాటర్లతో పాటు.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ తదితరులు కీలకం కానున్నారు.

అయితే, రహ్మనుల్లా గుర్బాజ్‌కు మాత్రం ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. అతనికి సెలెక్టర్లు మొండి చేయిచూపారు. అదే విధంగా ఓపెనింగ్‌ బ్యాటర్లు అబ్దుల్‌ మాలిక్‌, బహీర్‌ షా, వెటరన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇక్రం అలిఖిల్‌, అఫ్సర్‌ జజాయ్‌లతో అఫ్గనిస్తాన్‌ బ్యాటింగ్‌ విభాగం పటిష్టంగా ఉంది. ఇక అజ్మతుల్లాతో పాటు ఆల్‌రౌండర్‌ల విభాగంలో షాహిదుల్లా కమల్‌, షామ్స్‌ ఉర్‌ రహమాన్‌ చోటు దక్కించుకున్నారు.కాగా భారత్‌(India)లోని నోయిడా(Noida) వేదికగా అఫ్గనిస్తాన్‌- న్యూజిలాండ్‌ మధ్య సెప్టెంబరు 9 నుంచి ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆరంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే కివీస్‌ ఆటగాళ్లు భారత్‌కు చేరుకున్నారు. అఫ్గన్‌తో జరుగనున్న మొట్టమొదటి టెస్టులో విజయమే లక్ష్యంగా సన్నాహకాలు ముమ్మరం చేశారు.కాగా అఫ్గనిస్తాన్‌ ఇప్పటి వరకు మొత్తంగా తొమ్మిది టెస్టు మ్యాచ్‌లు ఆడగా కేవలం మూడు టెస్ట్ మ్యాచులే గెలిచింది .

న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టుకు అఫ్గన్‌ జట్టు ఇదే :

Test Team: హష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, అబ్దుల్ మాలిక్, రియాజ్ హసన్, అఫ్సర్ జజాయ్, ఇక్రం అలిఖిల్, బహీర్ షా మహబూబ్, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షామ్స్‌ ఉర్‌ రహమాన్‌, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, జహీర్ ఖాన్ పక్తీన్, కైస్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, నిజత్ మసూద్.

Advertisement

Next Story

Most Viewed