- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
15 నెలల తర్వాత నవోమి ఒసాకా రీఎంట్రీ
దిశ, స్పోర్ట్స్ : జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి, నాలుగు గ్రాండ్‌స్లామ్స్ విజేత నవోమి ఒసాకా దాదాపు 15 నెలల తర్వాత టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందు ఆస్ట్రేలియాలో జరుగుతున్న బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీలో బరిలోకి దిగిన ఆమె.. రీఎంట్రీని విజయంతో మొదలుపెట్టింది. సోమవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో ఒసాకా 6-3, 7-6(77-9) తేడాతో జర్మనీ క్రీడాకారిణి తమరా కోర్పాట్చ్‌పై విజయం సాధించింది. తొలి సెట్‌ను సునాయాసంగానే గెలుచుకున్న ఆమె.. రెండో సెట్‌లో మాత్రం ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. అయితే, ఏమాత్రం పట్టు వదలని ఒసాకా గేమ్‌ను టైబ్రేకర్‌లో సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం ఒసాకా మాట్లాడుతూ.. రీఎంట్రీ పట్ల చాలా ఆందోళనకు గురయ్యానని, తిరిగి రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. మాతృత్వం ఆటపై తన దృక్పథాన్ని మార్చేసిందని, గతంలో తాను అభిమానులు, సహచర క్రీడాకారుల నుంచి ఒంటరిగా ఫీలయ్యానని తెలిపింది. రెండో రౌండ్‌లో ఒసాకా.. చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోనాలి ప్లిస్కోవాతో తలపడనుంది. కాగా, రీఎంట్రీకి ముందు ఆమె 2022లో టోక్యోలో జరిగిన పాన్ పసిఫిక్ ఓపెన్‌లో పాల్గొంది. ఆ తర్వాత గర్భం దాల్చడంతో ఆమె ఆటకు విరామం ఇచ్చింది. గతేడాది జూలైలో ఒసాకా ఆడ బిడ్డ షైకి జన్మనించింది.