ICC World Cup 2023 : ప్రపంచ కప్‌ జట్టులో తెలుగు కుర్రాడికి చోటు!

by Vinod kumar |   ( Updated:2023-09-07 14:11:40.0  )
ICC World Cup 2023 : ప్రపంచ కప్‌ జట్టులో తెలుగు కుర్రాడికి చోటు!
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీకి నెదర్లాండ్స్‌ క్రికెట్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఐసీసీ ఈవెంట్‌లో పాల్గొనే 15 మంది సభ్యుల పేర్లను గురువారం వెల్లడించింది. అదే విధంగా ఇద్దరు రిజర్వు ప్లేయర్లను కూడా ఎంపిక చేసినట్లు తెలిపింది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ డచ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. తెలుగు మూలాలున్న తేజ నిడమనూరుకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టి న్యూజిలాండ్‌లో పెరిగిన అనిల్‌ తేజ.. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో నెదర్లాండ్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

తేజ నిడమనూరు నెదర్లాండ్స్ నేషనల్ టీమ్‌కు 2022 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతకుముందు న్యూజిలాండ్‌లో దేశవాళీ క్రికెట్ కూడా ఆడాడు. అక్టోబర్‌ 6న తమ తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో పాకిస్తాన్‌తో తలపడనుంది. హైదరాబాద్‌లో ఈ మ్యాచ్‌ జరుగుతుంది. తదుపరి నవంబర్‌ 11న బెంగళూరులో భారత్‌ను ఢీకొట్టనుంది.

నెదర్లాండ్స్ వన్డే ప్రపంచకప్ జట్టు:

స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్‌), మాక్స్ ఓ'డౌడ్, బాస్ డి లీడే, విక్రమ్ సింగ్, తేజ నిడమనూరు, పాల్ వాన్ మీకెరెన్, కోలిన్ అకెర్మాన్‌, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ర్యాన్ క్లైన్, వెస్లీ బరేసి, సకిబ్ జుల్ఫికర్, షరీజ్ అహ్మద్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్.

Advertisement

Next Story

Most Viewed