Neeraj Chopra: డైమండ్‌ లీగ్‌పై నీరజ్ ఫోకస్​..

by Vinod kumar |
Neeraj Chopra: డైమండ్‌ లీగ్‌పై నీరజ్ ఫోకస్​..
X

దిశ, వెబ్‌డెస్క్: ఒలంపిక్ స్వర్ణ పతక విజేత, భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్​ నీరజ్ చోప్రా మరోసారి డైమండ్ లీగ్‌లో సత్తా చాటాలని కసరత్తలు చేస్తున్నాడు. గాయం నుంచి కోలుకున్న ఈ స్టార్​ ప్లేయర్​.. స్విట్జర్లాండ్​ వేదికగా శుక్రవారం ప్రారంభం కానున్న డైమండ్‌ లీగ్‌ లుసానె టోర్నీలో బరిలో దిగనున్నాడు. ఈ ఏడాది దోహాలో జరిగిన తొలి డైమండ్‌ లీగ్‌ టోర్నీలో 88.67 మీటర్లకు జావెలిన్‌ను విసిరి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత గాయంతో ఎఫ్‌బీకే క్రీడలు (నెదర్లాండ్స్‌), పావో నూర్మి ఈవెంట్‌ (ఫిన్లాండ్‌)లకు దూరమయ్యాడు. అయితే ఈ సీజన్లో ఎలాగైనా 90 మీటర్ల లక్ష్యాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉన్న నీరజ్‌కు ఇప్పుడు లుసానె టోర్నీ మరో అవకాశాన్ని ఇస్తోంది.

నీరజ్‌ తన కెరీర్‌లో అత్యుత్తమంగా 2022 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 89.94 మీటర్ల దూరానికి జావెలిన్​ను విసిరి రికార్డుకెక్కాడు. అభినవ్ బింద్రా తర్వాత, వ్యక్తిగత ఆటల విభాగంలో భారత్​కు ఒలంపిక్స్‌లో బంగారు పతకం అందించాడు నీరజ్​ చోప్రా. ఇటీవలే ఓ అరుదైన రికార్డును సైతం తన పేరిట లిఖించుకున్నాడు. పురుషుల జావెలిన్ త్రోలో వరల్డ్ నెంబర్‌ ర్యాంకింగ్‌ని దక్కించుకున్న తొలి ఇండియన్ అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు. మరోవైపు దోహా డైమండ్ లీగ్‌లో తొలి స్థానంలో నిలిచి 8 పాయింట్లు సాధించి, స్విస్‌ లీగ్‌లో అడుగుపెట్టనున్నాడు.

Advertisement

Next Story

Most Viewed