- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘భారత ఏ’దే అనధికార టెస్టు సిరీస్
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ లయన్స్‌తో మూడు టెస్టుల అనధికార సిరీస్‌ను భారత్ ఏ జట్టు దక్కించుకుంది. ఆఖరి టెస్టులో నెగ్గి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆదివారం ఇంగ్లాండ్ లయన్స్‌పై 134 పరుగుల తేడాతో భారత్ ఏ జట్టు విజయం సాధించింది. భారత ఏ టీమ్ నిర్దేశించిన 402 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ లయన్స్ 268 పరుగులకే పరిమితమైంది. ఓవర్‌నైట్ స్కోరు 83/2తో చివరి రోజు ఆట కొనసాగించిన పర్యాటక జట్టును భారత ఏ జట్టు బౌలర్లు నిలువరించారు. ముఖ్యంగా సామ్స్ ములానీ(5/60) ఐదు వికెట్ల ప్రదర్శనతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. శరన్ష్ జైన్(3/50) సైతం మెరిశాడు. దీంతో రాబిన్సన్(80), అలెక్స్ లీస్(55) పోరాటం చేసినప్పటికీ.. మిగతా బ్యాటర్లు విఫలమవడంతో ఇంగ్లాండ్ లయన్స్‌కు ఓటమి తప్పలేదు.
Advertisement
Next Story