టీమ్ ఇండియా హెడ్ కోచ్ రేసులోకి ధోనీ?

by Harish |   ( Updated:2024-05-28 19:39:18.0  )
టీమ్ ఇండియా హెడ్ కోచ్ రేసులోకి ధోనీ?
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ మంచి ఆప్షన్ అని విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ తెలిపాడు. తాజాగా జాతీయ మీడియాతో అతను మాట్లాడుతూ.. ‘ప్రధాన కోచ్‌గా భారతీయుడినే నియమించాలి. ఐపీఎల్‌కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తే.. అతను మంచి ఆప్షన్ అవుతాడు. అతను చాలా క్రికెట్ ఆడాడు. అలాగే, బిగ్ టోర్నీల్లో జట్టును గెలిపించాడు. జట్టు కోసం ప్లాన్ చేయడం, దానిని సక్రమంగా నిర్వర్తించడం చాలా ముఖ్యం. ధోనీకి ఆ సామర్థ్యం ఉంది. ధోనీ కెప్టెన్ అయినప్పుడు జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నారు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ వంటి వాళ్లు అతని నాయకత్వంలో ఆడారు. అయినప్పటికీ, ధోనీ జట్టును అద్భుతంగా హ్యాండిల్ చేశాడు.’ అని చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed