ధోని గాయం గురించి చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ ఏమన్నారంటే?

by Shamantha N |   ( Updated:2024-04-15 14:21:15.0  )
ధోని గాయం గురించి చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ ఏమన్నారంటే?
X

దిశ, స్పోర్ట్స్ : ముంబైతో జరిగిన మ్యాచ్ లో హ్యాట్రిక్ సిక్స్ కొట్టి స్టేడియాన్ని హోరెత్తించాడు మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని. నాలుగు బంతుల్లోనే 20 పరుగులు చేసి అదరగొట్టాడు. ముంబైపై చెన్నై అదే తేడాతో ఓడిపోయింది. హైదరాబాద్, వైజాగ్ మ్యాచుల్లోనూ ధోనీ కోసమే అభిమానులు స్టేడియాని కొచ్చారు. ఓవైపు గాయం బాదిస్తున్నా.. ఫ్యాన్స్ కోసమే మైదానంలోకి వస్తున్నాడు ఈ మిస్టర్ కూల్. వైజాగ్‌లో మ్యాచ్‌ తర్వాత లెగ్ బ్యాండ్ తో కన్పించాడు ధోని. అయితే, ముంబై మ్యాచ్ లోను ధోని నొప్పిని భరిస్తూనే హిట్టింగ్ చేశాడని.. చెన్నై బౌలింగ్ కోచ్ ఎరిక్ సీమన్స్ తెలిపాడు.

ముంబయి బౌలింగ్‌ను చూస్తుంటే.. తమ స్కోరు 200ల్లోపే ఉంటుందని భావించామన్నాడు. ఓకే ఓవర్ తో 206 పరుగులకు చేరామన్నారు. ధోనీ ప్రతిసారి తమని సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నాడని అన్నాడు. ధోనితో పనిచేయడం అద్భుతమని.. క్రీజ్ లోకి వెళ్లగానే సిక్స్ కొట్టడం ఈజీ కాదని అన్నాడు. అప్పటికే ఆ బౌలర్‌ ఒక వికెట్‌ తీసి జోష్ పైన ఉన్నాడని.. కానీ ధోని ముందు మాత్రం తేలిపోయాడని అన్నాడు. నెట్స్‌లో ధోనీ ప్రాక్టీస్‌ను చూస్తే అతడి కష్టం అర్థమవుతుందన్నాడు. ఎలా ఆడాలని అనుకుంటాడో.. ఫీల్డ్ లో దాన్నే అమలు చేస్తాడని అన్నాడు. అందుకే, ధోనిని బ్యాటింగ్ వ్యూహంలో భాగంగా వాడుకుంటున్నామన్నాడు. డెత్‌ ఓవర్లలో ఎలా బౌలింగ్‌ చేయాలో అతడి ఆటను చూసి నేర్చుకుంటున్నామని అన్నాడు. సీజన్‌కు ముందు నిర్వహించిన సెషన్స్‌లో తమ ప్లాన్లను అతడిపైనే ప్రయోగించేవాళ్లమని తెలిపాడు.

శివమ్‌ దూబెకు స్పిన్నర్లతో బౌలింగ్‌ వేయించేందుకు ప్రత్యర్థి కెప్టెన్లు భయపడుతున్నాడని తెలిపాడు ఎరిక్. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో తమ బౌలింగ్‌ అత్యుత్తమంగా ఉందన్నాడు సీఎస్కే కోట్. శార్దూల్‌ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడన్నాడు. పతిరన ‘ఇంపాక్ట్’ ప్లేయర్‌గా బాగా ఆడాడని గుర్తుచేశాడు. మిడిల్ ఓవర్లలో పరుగులను నియంత్రించి ముంబయి ఓటమికి ప్రధాన కారణమయ్యాడని ఎరిక్‌ తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed