- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మోతెక్కనున్న మోదీ స్టేడియం: రేపే ఐపీల్ ప్రారంభం
దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కర్టన్ రైజర్ వేడుకలో ఈ సారి తారలు తళుక్కున మెరవనున్నారు. సౌత్ హీరోయిన్లు రష్మిక మందన్న, తమన్నా భాటియా తమ అందాలతో వీక్షకులను కనువిందు చేయనున్నారు. వర్ధమాన గాయకుడు అరిజిత్ సింగ్ తన గానామృతంతో ఐపీఎల్ ప్రేక్షకులను మైరమరపించేలా చేయనున్నాడు. పుష్ప సినిమాలో తన నటనతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు మరింత చేరువైంది రష్మిక మందన్న. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది తమన్న. వీరిద్దరికీ గాయకుడు అరిజిత్ సింగ్ తోడవడంతో మోతేరా స్టేడియం మోతెక్కిపోనుంది.
ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్.. నాలుగుసార్లు ట్రీఫీని కైవసం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. కరోనా కారణంగా రెండేళ్ల పాటు స్వదేశానికి దూరంగా జరిగిన ఐపీఎల్ ఈ సారి పూర్తిస్థాయిలో భారత్‌లో జరగబోతోంది. దీంతో ఆరంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. పలువురు సూపర్ స్టార్లు, హీరోయిన్లు ప్రారంభ వేడుకల్లో పాల్గొనబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, అవేవీ నిజం కాదంటూ రష్మిక మందన్న, తమన్నా భాటియా, అరిజిత్ సింగ్ మాత్రమే ప్రదర్శన ఇవ్వనున్నట్లు ఐపీఎల్ నిర్వహకులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.