కోహ్లీపై రిజ్వాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే?

by Harish |
కోహ్లీపై రిజ్వాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే?
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నుంచి ఎంతో నేర్చుకున్నామని పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ తెలిపాడు. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో పాక్ భారీ విజయం సాధించింది. హాఫ్ సెంచరీతో మెరిసిన రిజ్వాన్(75) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అవార్డు అందుకునే సమయంలో కోహ్లీ గురించి రిజ్వాన్ మాట్లాడుతూ.. ‘వరల్డ్ క్రికెట్‌లోనే అతను అద్భుతమైన ఆటగాడు. అతని నుంచి మేము ఎంతో నేర్చుకున్నాం. అతన్ని గౌరవిస్తాను.’ అని తెలిపాడు. కాగా, రెండో టీ20లో విజయంతో పాక్ 1-1తో సిరీస్‌ను సమం చేసింది. నేడు నిర్ణయాత్మక మూడో మ్యాచ్ జరగనుంది.

Advertisement

Next Story