Team India: రోహిత్ శర్మ తర్వాత అతడే టీమిండియా కెప్టెన్

by Gantepaka Srikanth |
Team India: రోహిత్ శర్మ తర్వాత అతడే టీమిండియా కెప్టెన్
X

దిశ, వెబ్‌డెస్క్: టెస్టుల్లో టీమిండియా(Team India) ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది. స్వదేశంలో న్యూజిలాండ్‌(New Zealand)తో జరిగిన మూడు మ్యాచ్‌లు సిరీస్‌లో మూడింట్లోనూ ఓటమి చెందారు. స్వదేశంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వైట్ వాష్‌కు గురికావడం భారత్‌(Team India)కు ఇదే తొలిసారి. దీంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. సీనియర్లు అయిన రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) ఉన్నప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. వాళ్లిద్దరు రిటైర్ అయ్యాక ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా టెస్టుల్లో రోహిత్(Rohit Sharma) తర్వాత జట్టును నడిపించే నాయకుడు ఎవరు? అనే చర్చ నెట్టింట్లో జరుగుతోంది.

దీంతో టెస్టుల్లో రోహిత్ తర్వాత పగ్గాలు తీసుకోబోయే కెప్టెన్‌పై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్(Mohammad Kaif) స్పందించారు. ఇటీవల ఆయన ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు. ప్రస్తుతం జట్టులో కేవలం రిషబ్ పంత్(Rishabh Pant) మాత్రమే రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ అయ్యేందుకు అర్హుడు. కెప్టెన్సీకి అతడు న్యాయం చేయగలడు. ఏ స్థానంలో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా రాణించగలడు. ఈ మొత్తం సిరీస్‌లో అతడు క్రీజులో ఉన్నంత సేపు కివీస్ బౌలర్లు భయపడ్డారు అని కైఫ్ చెప్పుకొచ్చారు.




Advertisement

Next Story